బోయ‌పాటి చేతిలో ముగ్గురు హీరోలు

మరిన్ని వార్తలు

బోయపాటి శ్రీ‌ను త‌దుప‌రి సినిమా ఎప్పుడు?  ఎవ‌రితో..?  అనే విష‌యంలో టాలీవుడ్ లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డుస్తోంది. రోజుకో వార్త పుట్టుకొస్తోంది. బోయ‌పాటి కూడా ఎవ‌రితో సినిమా ప‌ట్టాలెక్కించాల‌న్న విష‌యంలో కొద్దిపాటి క‌న్‌ఫ్యూజ‌న్‌లోనే ఉన్నాడు. త‌న చేతిలో ముగ్గురు స్టార్ హీరోలు ఉన్నారు. బాల‌కృష్ణ‌, బ‌న్నీ, సూర్య‌... బోయ‌పాటితో సినిమా చేయ‌డానికి రెడీగా ఉన్నారు. అయితే వీళ్ల‌లో ఎవ‌రితో ముందుకు వెళ్లాల‌న్న విష‌యంలో ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. ఈవారంలో... ఈ విష‌యంపై పూర్తి క్లారిటీ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి.


ఎందుకంటే.. ఈ ముగ్గురు హీరోల‌తో డిస్క‌ర్ష‌న్లు ఫైన‌ల్ స్టేజీకి వ‌చ్చేశాయి. ఎవ‌రు అందుబాటులో ఉన్నారు, ఎవ‌రితో ఎప్పుడు సినిమా మొద‌లెట్టొచ్చు అనే విష‌యంలో ఈ వారంలో స్ప‌ష్ట‌త రానుంది. బోయ‌పాటి బాల‌య్య‌తో గ‌నుక ఫిక్స‌యితే.. జూన్ 10 బాలయ్య పుట్టిన‌రోజు సంద‌ర్భంగా, అఖండ 2 ని ప‌ట్టాలెక్కించి, 2024 సంక్రాంతికి విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. బ‌న్నీతో గ‌నుక సినిమా ఓకే అనుకొంటే ఏప్రిల్ 8న బ‌న్నీ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమాని లాంఛ‌నంగా ప్రారంభిస్తారు. రామ్ - బోయ‌పాటి కాంబో స్కంద‌ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఈసినిమా స‌రైన ఫ‌లితాన్ని తీసుకురాలేదు. అయితే ఓటీటీలో మాత్రం రికార్డు స్థాయి వ్యూస్‌ని సంపాదించుకొంటోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS