బాలీవుడ్ లో బయోపిక్ ట్రెండ్స్ ఎక్కువగా ఉంది. కానీ సౌత్ లో బయోపిక్స్ కి పెద్దగా ఆదరణ లేదు. సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమా ఒకటే హిట్ అయ్యింది. ప్రజంట్ అన్ని ఇండస్ట్రీలలోను బయోపిక్స్ ట్రెండ్ నడుస్తుండటంతో ఇప్పుడు టాలీవుడ్ హీరోలు కూడా వీటి పై ఆసక్తి కనబరుస్తున్నారు. విలక్షణ నటుడు దగ్గుబాటి రానా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరో స్థాయిని అందుకున్నాడు. రానా ఇప్పుడు ఓ బయోపిక్ పై మనసుపడ్డారు. రీసెంట్ గా రానా ఓ ఈవెంట్లో పాల్గొన్నాడు. అక్కడ బయోపిక్ గూర్చి ప్రశ్నలు ఎదురవగా 'నేను స్పోర్ట్స్ బేస్డ్ బయోపిక్ తీస్తాను. గ్రేట్ బాక్సర్ 'ముహమ్మద్ అలీ' బయోపిక్ తీయాలనుకుంటున్నాను' అని పేర్కొన్నాడు.
ముహమ్మద్ అలీ వరల్డ్ గ్రేటెస్ట్ బాక్సర్స్ లో ఒకరు. ఎన్నో వరల్డ్ రికార్డులు సృష్టించాడు. ఒలంపిక్స్ లో కూడా ఎన్నో మెడల్స్ సాధించాడు. అమెరికాకు చెందిన ఈ బాక్సర్ కి వరల్డ్ వైడ్ ఫాన్స్ ఉన్నారు. అలీ హెవీవెయిట్ బాక్సర్‌గా గుర్తింపు పొందాడు. 6.3 హైట్, మంచి వెయిట్ తో రింగ్ లో ప్రత్యర్థులకి చెమటలు పట్టించేవాడు. 2016లో అలీ మరణించారు. బాక్సింగ్ వెలుపల, అలీ స్పోకెన్ వర్డ్ ఆర్టిస్ట్‌గా విజయం సాధించాడు, రెండు ఆల్బమ్‌లను కూడా చేశాడు. ఐ యామ్ ది గ్రేటెస్ట్, ది అడ్వెంచర్స్ ఆఫ్ అలీ అండ్ హిస్ గ్యాంగ్ vs. మిస్టర్ టూత్ డికే ఈ రెండు ఆల్బమ్‌లు గ్రామీ అవార్డుకి నామినేట్ అయ్యాయి. ముహ్మమూద్ కేవలం బాక్సర్ మాత్రమే కాదు నటుడు,రచయిత. రెండు ఆత్మకథలను విడుదల చేశాడు.
ఈ బాక్సర్ పై హాలీవుడ్ లో సినిమాలు వచ్చాయి. ఇండియాలో రాలేదు. అందుకే ముహమ్మద్ ఆలీని ఇండియన్స్ కి పరిచయం చేస్తానని, ఆ పాత్రని కూడా స్వయంగా తానే పోషిస్తానని చెప్పాడు రానా. నటుడుగా, నిర్మాతగా ఒక గ్రేట్ బాక్సర్ జీవితాన్ని ఇండియన్ ప్రేక్షకులకి పరిచయం చేసే బాధ్యతని రానా తీసుకుంటా అన్నాడు. రానా హైట్, బాడీ వెయిట్ అలీ పాత్రకి కరెక్ట్ గా సెట్ అవుతాయి. రానా చేసే ఈ ప్రాజెక్ట్ తో ఇండియన్ ఆడియన్స్ కి ఇంకా ఇంకా అతని గూర్చి తెలుసుకునే అవకాశం ఉంది.