రీసెంట్ గా సైంధవ్ సినిమాతో ఆడియన్స్ ని పలకరించిన విక్టరీ వెంకటేష్, నెక్స్ట్ అనిల్ రావిపూడి తో ఒక సినిమా చేయనున్నాడు. రానా నాయుడు సిరీస్ తో వెంకీలో మరో కోణం బయట పడింది. టాలీవుడ్ లో వెంకీ ని ఆ పాత్రలో చూసి రిసీవ్ చేసుకోలేకపోయారు కానీ నార్త్ లో వెంకీ నటనకి ఫిదా అయిపోయారు. ఈ సిరీస్ తో వెంకీ ఎలాంటి క్యారక్టర్ అయినా చేయగలడని నిరూపించాడు. దాని తరవాత వెంకీకి చెప్పుకోదగిన హిట్ లేదు. ఇప్పుడు అనిల్ రావిపూడి వెంకీ కాంబో తప్పకుండా హిట్ అవుతుందని ఫాన్స్ ఆశగా ఉన్నారు.
సినిమా టైటిల్ కూడా అప్పుడే ఫిక్స్ చేశారు. 'సంక్రాంతికి వస్తున్నాం' అన్న టైటిల్ తో సంక్రాంతి బరిలో దిగుతాం అని అనౌన్స్ చేశారు. మొదటి నుంచి అనిల్ రావిపూడి టైటిల్స్ కొంచెం కొత్తగా ఉంటున్నాయి. అదే బాటలో ఈ టైటిల్ కూడా ఉందని అంటున్నారు నెటిజన్స్. వెంకీ, అనిల్ రావిపూడిలది హిట్ కాంబో ఈ మూవీ తో హ్యాట్రిక్ కొట్టడం పక్కా అని ధీమాగా ఉన్నారు వెంకీ ఫాన్స్. అనిల్ రీసెంట్ గా బాలయ్య తో భగవంత్ కేసరి తీసి ఫుల్ మార్కులు సంపాదించాడు. అన్ని కమర్షియల్ అంశాలతో పాటు మెసేజ్ కూడా ఇస్తూ బాలయ్యకి మంచి హిట్ అందించాడు. దీనితో వెంకీకి కూడా హిట్ గ్యారంటీ.
ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇందులో వెంకటేష్ తో పాటు మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఫుల్ లెన్త్ రోల్ కాకుండా గెస్ట్ లు గా కనిపించే ఛాన్స్ ఉందని టాక్. వారు మరెవరో కాదు రవితేజ, బాలకృష్ణలు. వీరిరువురు వెంకీ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నారట. కెరీర్ ఆరంభం నుంచి హిట్లతో దూసుకు పోతున్న అనిల్ రావిపూడి వచ్చే సంక్రాంతికి వెంకటేష్ తో కలిసి బాక్సా ఫీస్ వద్ద ఎలాంటి మేజిక్ చేస్తారో చూడాలి.