నటసింహం బాలకృష్ణ సినిమాల విషయంలో ఎంత క్రమశిక్షణ కలిగిన నటుడో అలాగే బయట కూడా ఆయన అంతే క్రమశిక్షణ పాటిస్తుంటాడు.
అయితే ఆయన కళ్ళముందు ఎవరైనా పరిధి దాటి ప్రవర్తిస్తే మాత్రం ఆయనలో ఉగ్రనరసింహుడు బయటకి వచ్చేస్తాడు. ఇలాంటి ఒక సంఘటనే ఈ మధ్య జరిగింది.
వివరాల్లోకి వెళితే, బాలకృష్ణ తన ఫ్యాన్స్ తో ఫోటోలు దిగుతున్న సందర్భంగా కొందరు అభిమానులు అత్యుత్సాహం చూపడంతో బాలయ్య కోపాద్రిక్తుడై వారిని తీవ్ర స్థాయిలో మందలించాడు. ఆ సమయంలో తీసిన వీడియో ఇప్పుడు అంతర్జాలంలో చక్కర్లు కొడుతున్నది.
ఇక యాంటీ బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే ఈ వీడియోలో బాలకృష్ణ ప్రవర్తన పై చురకలు వేస్తూ వీడియోని షేర్ చేస్తున్నారు. అయన అభిమానులు మాత్రం, బాలకృష్ణ క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని, పరిది దాటితే సొంత అభిమాని అయినా ఉపేక్షించడు అని చెబుతున్నారు.
ALSO SEE :
ఫ్యాన్స్ పై ఆగ్రహిస్తున్న బాలయ్య వీడియో