అల్లు అర్జున్ తో పాటుగా దువ్వాడ జగన్నాధం టీం మొత్తం ఈ రోజు ఉదయం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు.
ఇప్పటికే DJ రిలీజ్ కి సంబంధించి టీం మొత్తం ప్రొమోషన్స్ మొదలుపెట్టేశారు. దీనిలో భాగంగానే ఈ రోజు తిరుమల దర్శన తరువాత టీం మొత్తం అమెరికా వెళ్ళాలని ప్లాన్ లో ఉన్నట్టు సమాచారం.
ఇక అస్మైక పాటకి సంబందించిన లిరిక్స్ కూడా మార్చేయడంతో ఈ పాట పై నెలకొన్న వివాదానికి తెరపడింది. మరి DJ చిత్ర విశేషాలకు వస్తే, దువ్వాడ జగన్నాధం పాత్ర అందరిని అలరించేలా ఉంటుంది అని అలాగే చిత్రంలో వచ్చే ఫైట్స్, సాంగ్స్ హైలైట్ గా ఉండబోతున్నాయి అని సమాచారం.
సో.. బన్నీ ఇంకొక రెండు రోజుల్లో DJగా థియేటర్ల లో సందడి చేయనున్నాడు.