టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ల లిస్టులో అనిల్ రావిపూడి పేరు తప్పకుండా ఉంటుంది. వరుసగా 5 విజయాలు. అవీ ఒకదాన్ని మంచి ఒకటి... మరి అంత క్రేజ్ లేకపోతే ఎలా? సరిలేరు నీకెవ్వరు తరవాత ఎఫ్ 3 సినిమా పనుల్లో బిజీ అయిపోయాడు. అయితే ఎఫ్ 3 తరవాత చేయబోయే సినిమా ఏమిటన్న విషయంలోనూ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.
ఎఫ్ 3 తరవాత... నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతున్నాడు అనిల్ రావిపూడి. ఈ మేరకు నందమూరి బాలకృష్ణ కాంపౌండ్ వర్గాలు కూడా ఓ హింట్ ఇచ్చేశాయి. త్వరలోనే వీరిద్దరూ జట్టు కట్టడం ఖాయమని చెబుతున్నాయి. నిజానికి పటాస్ తరవాత అనిల్ రావిపూడి బాలయ్యతో పనిచేయాలి. `రామారావుగారు` అనే ఓ కథ కూడా చెప్పాడు. అయితే ఎందుకనో ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఈమధ్య ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ `బాలయ్యతో, మోక్షజ్ఞతో సినిమా చేయాలనివుంది` అని తన మనసులో మాట బయటపెట్టాడు అనిల్ రావిపూడి. అది తెలుసుకున్న బాలయ్య... అనిల్ రావిపూడికి ఫోన్ చేసినట్టు, ఇద్దరి మధ్యా సినిమాకి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చినట్టు టాక్.