సెలబ్రిటీల పుట్టినరోజంటే.. వారి అభిమానులకి పండగే. కానీ, ఈసారి పరిస్థితులు వేరు. మోహన్‌బాబు, రావ్‌ుచరణ్.. తమ పుట్టినరోజు వేడుకలు జరుపుకోలేదు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పుట్టినరోజు నేడు. ఆయనా తన పుట్టినరోజుని ప్రత్యేకంగా జరుపుకోవడంలేదు. పైగా, తన పుట్టినరోజున తనదైన స్టయిల్లో సేవా కార్యక్రమాలకు పరిమితమయ్యారు. కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. దాంతో, ఎక్కడికక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. అలా ఇబ్బందులు పడుతున్నవారికి తనవంతు సాయం చేస్తున్నారు ప్రకాష్‌రాజ్.
చెన్నయ్, ఖమ్మం, పాండిచ్చేరి వంటి ప్రాంతాల్లో ఇరుక్కుపోయినవారికి ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నట్లు చెప్పారు ప్రకాష్‌రాజ్. ఇది ప్రభుత్వం చేయాల్సిన పని మాత్రమే కాదనీ, దాంతోపాటుగా ప్రజలు కూడా బాధ్యతాయుతంగా మెలగాల్సిన సందర్భమనీ ప్రకాష్‌రాజ్ అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ, చేతనైతే మరో వ్యక్తికి లేదా మరో కుటుంబానికి సాయం చేయాలని ప్రకాష్‌రాజ్ పిలుపునిచ్చారు. ‘అదే మానవత్వం..’ అంటూ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు ప్రకాష్ రాజ్.