అబ్బాయి కోసం వస్తున్న బాలయ్య బాబాయ్..!

మరిన్ని వార్తలు

నందమూరి అభిమానులు ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న ఒక కలయిక రేపు సాయంత్రం నిజం కాబోతున్నది. ఇంతకి ఆ అపూర్వ కలయిక ఏంటో మీరు ఇప్పటికే ఊహించేసే ఉంటారు. అదే బాలకృష్ణ-ఎన్టీఆర్ ఒకే వేదిక పంచుకోనుండడమే..

రేపు సాయంత్రం హైదరాబాద్ లో జరగబోయే అరవింద సమేత వీర రాఘవ విజయోత్సవ వేడుకకి ముఖ్య అతిధిగా నందమూరి నటసింహం బాలకృష్ణ రానున్నారు. చాలా ఏళ్ళ తరువాత అంటే బాలకృష్ణ పరమ వీర చక్ర ఆడియో విడుదల వేడుకలో చివరిసారిగా వేదిక పంచుకున్న తరువాత మళ్ళీ ఇన్నాళ్ళకి బాలకృష్ణ-ఎన్టీఆర్ ఒక వేదిక పైనుండి అభిమానులని అలరించనున్నారు.

ఇప్పటికే అరవింద సమేత విజయంతో మంచి జోష్ లో ఉన్న నందమూరి అభిమానులకి రేపు జరగబోయే ఈ వేడుక ఆ వేడుకకి బాలయ్య రానుండడం నిజంగా ఒక పండగనే చెప్పాలి.

మొత్తానికి ఇన్నిరోజులుగా బాలయ్య-తారక్ లని ఒకే వేదికపైన తమ అభిమానులని అలరించబోతున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS