అర్జున్‌పై శృతి 'మీ..టూ..' ఆరోపణలు

By iQlikMovies - October 20, 2018 - 16:49 PM IST

మరిన్ని వార్తలు

అర్జున్‌ అంటే, అల్లు అర్జున్‌ కాదు. ఈయన తమిళ నటుడు అర్జున్‌. తెలుగులో అల్లు అర్జున్‌తో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలో నటించిన సీనియర్‌ నటుడు అర్జున్‌, చాలా తెలుగు సినిమాల్లో కనిపించిన సంగతి తెల్సిందే. ఆయనపై ఓ హీరోయిన్‌ 'మీ..టూ..' అంటూ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. 

ఆమె కన్నడ హీరోయిన్‌. పేరు శృతి. శృతిహాసన్‌ కాదు, ఈ శృతి అసలు పేరు శృతి హరిహరన్‌. ఓ సినిమా షూటింగ్‌ సమయంలో తనతో అర్జున్‌ అసభ్యకరంగా ప్రవర్తించాడనే ఆరోపణలు చేసింది ఈ హీరోయిన్‌. 2016లో జరిగిందట ఈ ఘటన. అర్జున్‌ జుగుప్సాకరంగా తన శరీరాన్ని తడిమేస్తోంటే, తాను చాలా బాధపడినప్పటికీ ఆ విషయాన్ని బయటపెట్టలేకపోయాననీ, తన సమస్యను ఆ సమయంలో దర్శకుడు గుర్తించాడని చెప్పింది ఈ హీరోయిన్‌. 

బాలీవుడ్‌ నుంచి సౌత్‌ సినిమా వరకు 'మీ..టూ..' ఉద్యమ ప్రకంపనలు కనిపిస్తున్న ఈ నేపథ్యంలో తన వాయిస్‌ని వినిపించడం ద్వారా ఇన్నేళ్ళపాటు తన గుండెల్లో దాచుకున్న బాధను బయటపెట్టగలిగానని శృతి హరిహరన్‌ అంటోంది. ఇప్పటివరకు తమిళ సినీ ప్రముఖుల్లో ఓ రచయిత మాత్రమే 'మీ..టూ..' ఆరోపణల్ని ఎదుర్కొన్నారు. గాయని, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్మయి ఆయననపై ఆరోపణలు చేసింది. అయితే శ్రీరెడ్డి, తెలుగుతోపాటు తమిళ సినీ ప్రముఖులపైనా లైంగిక వేధింపులు - కాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలు చేసిన సంగతి తెలుసు కదా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS