అధినాయ‌కుడు గెట‌ప్‌లో మ‌రోసారి

మరిన్ని వార్తలు

వ‌య‌సుకి త‌గిన పాత్ర‌లు ఎప్పుడో గానీ దొర‌క‌వు. మ‌న హీరోల వ‌య‌సు యాభై దాటేసినా, మ‌న‌వ‌ళ్లూ, మ‌న‌వ‌రాళ్లూ వ‌చ్చేసినా, ఇప్ప‌టికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ పాత్రల్లో క‌నిపించ‌డ‌మే ఇష్టం. అభిమానులూ.. త‌మ హీరోల్ని అలానే చూడాల‌నుకుంటారు. కానీ ద్విపాత్రాభిన‌యం, త్రిపాత్రాభిన‌యం చేసేట‌ప్పుడు మాత్రం త‌మ వ‌య‌సుని గుర్తు చేసే అవ‌కాశం వ‌స్తుంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు `అధినాయ‌కుడు` చిత్రంలో బాల‌య్య మూడు అవ‌తారాల్లో క‌నిపించాడు. అందులో ముదుస‌లి పాత్ర ఒక‌టుంది. ఇప్పుడు స‌రిగ్గా ఆ గెట‌ప్‌లోనే మ‌ళ్లీ బాల‌య్య క‌నిపించ‌బోతున్నాడ‌ని టాక్‌.

 

నంద‌మూరి బాల‌కృష్ణ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఆ వెంట‌నే బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య ఓ సినిమా చేయ‌నున్నారు. ఇప్ప‌టికే బి.గోపాల్ బాల‌య్య‌కు త‌గిన క‌థ రెడీ చేశార‌ని తెలుస్తోంది. ఇందులో బాల‌య్య అర‌వై ఏళ్ల వ‌య‌సు వాడిగా క‌నిపిస్తార్ట‌. అయితే ఆ సినిమాలో బాల‌య్య ఆ ఒక్క పాత్ర‌లోనే క‌నిపిస్తారా, డ్యూయ‌ల్ రోలా.. అనేది తెలీదు. నిజంగా బాల‌య్య సోలో గానే క‌నిపిస్తే అదో ప్ర‌యోగం అవుతుంది. ఎందుకంటే.. అంత‌టి వ‌యసు మీరిపోయిన పాత్ర‌లు ధ‌రించ‌డం అంటే స‌వాలుతో కూడుకున్న వ్య‌వ‌హార‌మే. ఈ సినిమాలో సెంటిమెంట్ పాళ్లు బాగా ద‌ట్టించార‌ని, బాల‌య్య పాత్ర చాలా హుందాగా సాగుతుంద‌ని స‌మాచారం అందుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS