నిఖల్ హీరోగా తెరకెక్కుతోన్న ‘కార్తికేయ 2’ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. స్వయంగా నిఖిల్ ఈ విషయాల్ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు. ఈ సినిమాలో 5000 ఏళ్ల క్రితం నాటి రహస్యాల్ని చూపించబోతున్నారట. కాంచీపురంలోని వరద రాజ పెరుమాల్ ఆయం, గుజరాత్‌లోని ద్వారక, ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాయం తదితర సుప్రసిద్ధ పురాతన ఆలయాల్ని సందర్శించి వేదాల్లోని సారాల్ని తెలుసుకున్నారట. మనం మన సంప్రదాయాల్ని, చరిత్రను ఎలా మర్చిపోయామనే ఆసక్తికరమైన విషయాలు ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారట. దేవుడి గురించి ప్రస్థావనను కీలకంగా చూపించబోతున్నారట.
ఈ తరహా సినిమాల్లో సీక్వెల్స్ ఇంతవరకూ సక్సెస్ అయిన దాఖలాల్లేవ్. కానీ, ‘కార్తికేయ 2’ని మాత్రం సవాల్‌గా తీసుకున్నారట. సక్సెస్, ఫెయ్యిూర్స్‌తో సంబంధం లేకుండా ఓ మంచి కథని, ఆసక్తికరమైన విషయాల్ని ఈ సినిమా ద్వారా చూపించాలని చిత్ర యూనిట్ అనుకుంటోందట. చందూ మొండేటి అండ్ టీమ్ గత ఆరు నెలుగా ఈ ప్రాజెక్ట్‌పై తీవ్రంగా కసరత్తు చేసి, ఇన్‌ఫామేషన్ గేదర్ చేసిందట. ఇటీవలే తిరుపతిలో స్టార్ట్ అయిన ఈ సినిమా అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ చేసుకోనుంది. అంతేకాదు ఇటీవలే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న నిఖిల్, తన పెళ్లి పనుల్ని సైతం పక్కన పెట్టి మరీ ఈ ప్రాజెక్టుపై వర్క్ చేస్తున్నానంటున్నాడు. అంటే ఈ ప్రాజెక్టుని ఎంత ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడో నిఖిల్ అర్ధం చేసుకోవచ్చు ఇకపోతే,. దసరాకి సినిమాని విడుదల చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉందట.