నటసింహం బాలకృష్ణ 100 చిత్రాలలో భైరవద్వీపం చిత్రానికి ఒక ప్రత్యేఖ గుర్తింపు ఉంది.
జానపద చిత్రాల క్లబ్ లో ఈ చిత్రానికి గొప్ప స్థానం ఉంది. ప్రముఖ దర్శకుడైన సింగీతం శ్రీనివాస రావు రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు చలనచిత్ర పుస్తకంలో తనకంటూ ఒక పేజిని సొంతం చేసుకుంది.
బాలయ్య తన నటనతో ప్రేక్షకుల మన్ననలతో పాటుగా నంది పురస్కారాన్ని కూడా పొందాడు. ఇక ఈ చిత్రానికి సంగీతం మాధవిపెద్ది సురేష్ అందించగా రావి కొండల రావు గారు మాటలు రాసారు.
ఈ చిత్రంలో అద్భుతంగా పాటలు పాడి ఎస్పీ బాలు, జానకి గార్లకి నంది అవార్డులు వరించాయి. వీటన్నిటితో పాటుగా దర్శకుడు సింగీతంకి, నిర్మాత వెంకటరామిరెడ్డి కి నంది పురస్కారాలు పొందడం విశేషం.
మొత్తంగా నాలుగు నంది అవార్డులు, ఒక ఫిలిం ఫేర్ అవార్డులతో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ తో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం తన ఖాతాలో వేసుకుంది.