బాల‌య్య ఇంట్లో పార్టీ.. ఇక ఫుల్ జోష్‌!

మరిన్ని వార్తలు

జూన్ 10... నంద‌మూరి అభిమానుల‌కు బాగా ఇష్ట‌మైన రోజు. ఎందుకంటే ఆ రోజు బాల‌కృష్ణ పుట్టిన రోజు. అయితే ఈ జూన్ 10కి మ‌రింత ప్ర‌త్యేక‌త ఉంది. ఈ యేడాది బాల‌య్య 60వ పుట్టిన రోజు జ‌రుపుకోబోతున్నారు. అంటే ష‌ష్టి పూర్తి అన్న‌మాట‌. అందుకే ఈసారి ఈ పుట్టిన రోజు.. పండ‌గ‌లా చేసుకోబోతున్నారు బాల‌య్య అభిమానులు. ఆ రోజు బాల‌య్య ఇంట్లోనూ ఓ విందు ఉంద‌ట‌.

 

బాల‌కృష్ణ త‌న‌కు అత్యంత స‌న్నిహితుల్ని పిలిచి ఓ పార్టీ ఇవ్వ‌బోతున్న‌ట్టు టాక్‌. మ‌రి ఆ పార్టీకి ఎవ‌రెవ‌రు వ‌స్తారు? అనేది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. లాక్ డౌన్ నేప‌థ్యంలో విందులు, వినోదాల‌కు చాలా ప‌రిమితులు విధించింది ప్ర‌భుత్వం. 20 మంది అతిథులు మించ‌కూడ‌ద‌ని ఓ నిబంధ‌న ఉంది. ఆ మార్గ ద‌ర్శ‌కాల‌ను అనుస‌రిస్తూనే బాల‌య్య పార్టీ ఇవ్వ‌బోతున్న‌ట్టు టాక్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS