బాలకృష్ణ సినిమాలంటే... డైలాగులు, టైటిళ్లతో సహా అన్నీ పవర్ ఫుల్ గా ఉండాలి. సింహా, లెజెండ్, రూలర్.. ఇలా ఉంటేనే అభిమానులకు నచ్చుతుంది. ఇలాంటి టైటిళ్లు పెట్టి `దమ్ము` చూపించడంలో... సరైనోడు అనిపించుకున్నాడు బోయపాటి. వీళ్ల సూపర్ కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ సినిమాకి మాత్రం ఇప్పటి వరకూ టైటిల్ సెట్టవ్వలేదు. బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడో మొదలైంది. కొంత మేర షూటింగ్ జరిగింది. కరోనా కారణంతో ఆగిపోయింది.
బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఓ టీజర్ ని విడుదల చేశారు. అది ఫ్యాన్స్‌కి బాగా నచ్చింది కూడా. కానీ టైటిల్ ఏమిటన్నది ఇప్పటి వరకూ చెప్పలేదు. మోనార్క్, మొనగాడు, బొనాంజా.. ఇలా చాలా పేర్లు బయటకు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా డేంజర్ అనే టైటిల్ వినిపిస్తోంది. ఈ టైటిల్ నిజంగా బాలయ్య మైండ్ లో ఉందా? లేదంటే... ఫ్యాన్స్ క్రియేట్ చేసిందా? అన్నది తేలడం లేదు. ఈ టైటిల్ తో ఇది వరకు ఓ సినిమా వచ్చింది. కృష్ణవంశీ దర్శకత్వంలో. అయితే అది ఫ్లాపే. అలాంటి డేంజర్ టైటిల్ ని బాలయ్యకు పెడతాడా? అన్నది ఆలోచించుకోవాల్సిందే. బోయపాటి ఆ టైటిల్ ఏదో రివీల్ చేస్తే... బాగుంటుంది. లేదంటే.. ఇలాంటి టైటిళ్లు పుట్టుకొస్తూనే ఉంటాయి.