అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఆహ్లాదకర చిత్రం 'క్షీర సాగర మథనం'. మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందుతున్నఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్, హీరోలుగా నటిస్తున్నారు. అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడు. 'క్షీరసాగరమథనం' టీజర్ ను ఈరోజు (ఆగస్టు 21 ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ప్రముఖ దర్శకుడు క్రిష్ ట్విట్టర్ లో విడుదల చేసి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చిత్ర దర్శకుడు అనిల్ పంగులూరి మాట్లాడుతూ.. 'క్షీర సాగర మథనం' చిత్రం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. కొత్త తరహా చిత్రాలను ఆదరించడంలో ఎప్పుడూ ముందుండే తెలుగు ప్రేక్షకులు.. "క్షీర సాగర మథనం" చిత్రాన్ని తప్పక ఆదరిస్తారనే నమ్మకముంది. మా చిత్రం టీజర్ సంచలన దర్శకులు క్రిష్ చేతుల మీదుగా విడుదల కావడం సంతోషంగా ఉంది" అన్నారు.