నట సింహం నందమూరి బాలకృష్ణ సినిమాలంటే.. ఒన్లీ యాక్షన్, అలాగే బాలయ్య అభిమానులకు మాత్రమే ఆయన సినిమాలు అన్నట్లు ఉండేవి ఒకప్పుడు. కానీ ఇప్పుడు బాలయ్య మారాడు. తన సినిమా కథల విషయంలో.. తానూ చేసే యాక్షన్ విషయంలో బాలయ్యలో మార్పు వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షుకులను దృష్టిలో పెట్టుకుని బాలయ్య సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇకపై తానూ చేయబోయే సినిమాల్లో కొత్తదనం ఖచ్చితంగా ఉండాలని బాలయ్య పట్టుబడుతున్నారట.
ప్రస్తుతం బాలయ్య కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో 'రూలర్' సినిమాని కంప్లీట్ చేశారు. కాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డిసెంబర్ నెలలోనే కొత్త సినిమాను స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమాలో 'సింహ, లెజెండ్' చిత్రాల మాదిరిగా మాస్ అండ్ యాంగ్రీ హీరోగానే కాకుండా ఇంకాస్త కొత్తగా కనిపించాలని బాలయ్య బలంగా కోరుకుంటున్నారట. అందుకే బోయపాటి సైతం బాలయ్య అభిరుచికి తగ్గట్లు స్క్రిప్ట్ లో మార్పులు చేయించాల్సి వచ్చింది.
ముఖ్యంగా బాలయ్య ఆదేశాల మేరకు పాత్రలో వైవిధ్యంతో పాటు, కొత్త తరహా కథను సిద్దం చేశారట బోయపాటి. మొత్తానికి బాలయ్య తన తర్వాతి సినిమాలను కూడా అలాగే కొత్తగా చేసి.. ఈ తరం యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షుకులను ఆకట్టుకోవాలని గట్టిగా భావిస్తున్నారట. మరి బాలయ్య కొత్తదనం ఎలా ఉంటుందో.. అందర్నీ బాలయ్య ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో చూడాలి.