సింహా, లెజెండ్ తరవాత.. నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను మళ్లీ కలిశారు. వీళ్ల కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమా తయారవుతోంది. టైటిల్ ఇంకా ఫిక్సవ్వలేదు. BB 3 గానే చలామణీ అవుతోంది. ఇందులో బాలయ్య రెండు రకాల గెటప్పుల్లో కనిపించనున్నాడు. అందులో ఒక పాత్ర అఘోరా అని ముందు నుంచీ ప్రచారం జరుగుతూనే ఉంది. బాలయ్య అఘోరాగా సూటవుతాడా? బాలయ్యని ఆ పాత్రలో చూడగలుగుతురా? అని ఆయన అభిమానులూ సందేహించారు. ఇప్పుడు అదే డౌటు బాలయ్యకూ వచ్చింది. తనని అఘోరాగా చూస్తారా, లేదా? అనే భయం వెంటాడుతోంది. అందుకే ఆ పాత్రని తొలగించారని తెలుస్తోంది. ఆ పాత్రని పూర్తిగా పక్కన పెట్టి, మరో పాత్ర రాసుకున్నార్ట. ఇప్పుడు ఆ మార్పులు, చేర్పులకు సంబంధించిన కసరత్తులు మొదలయ్యాయని సమాచారం.
అయితే ఇది వరకే బాలయ్య అఘోరా గెటప్పులో సన్నివేశాల్ని చిత్రీకరించారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో వాటికి సంబంధించిన సీన్లు పూర్తయ్యాయి. మహాశివరాత్రి సందర్భంగా బాలయ్య అఘోరా గెటప్ ని రివీల్ చేయాలనుకున్నారు. టైటిల్ కూడా అప్పుడే ప్రకటిద్దామనుకున్నారు. కానీ... శివరాత్రికి ఎలాంటి అప్ డేటూ రాలేదు. బాలయ్య అఘెరా పాత్ర పట్ల అసంతృప్తిగా ఉన్నాడని, అందుకే ఆయా సన్నివేశాల్ని పూర్తిగా పక్కన పెట్టాలన్న నిర్ణయానికి వచ్చాడని గుసగుసలు మొదలయ్యాయి. ఇప్పుడు వాటిని పక్కన పెట్టారంటే.. రీషూట్లు మొదలెట్టినట్టే. మేలో ఈ సినిమా విడుదల చేయాలన్నది దర్శక నిర్మాతల ప్లాన్. ఆ సమయానికి రీషూట్లు పూర్తవుతాయో లేదో?