నందమూరి బాలకృష్ణ ‘చెన్నకేశవ రెడ్డి’ రీరిలీజ్ అవుతుంది, రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 300 థియేటర్స్ లో సినిమాని ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా రెవెన్యులో 75శాతం బసవతారకం ట్రస్ట్ కి ఇస్తున్నట్లు నిర్మాత బెల్లం కొండ సురేష్ చెప్పారు.
'' చెన్నకేశవ రెడ్డి’ రీరిలీజ్ లో ఎక్కడ అడ్వాన్స్ బుకింగ్ చేసినా ఒక అరగంటలో ఫుల్ అయిపోయి మళ్ళీ షోలు పెంచే పరిస్థితి వుండటం గొప్ప ఎనర్జీ ఇస్తుంది. సెప్టెంబర్ 24న ప్రిమియర్ షోలతో మొదలుపెట్టి, 25న రెగ్యులర్ షోలు వుంటాయి. రీరిలీజ్ లో ఒక సినిమాని కోటి రూపాయిలకి అడిగినా దాఖలాలు ఎక్కడా లేవు. కానీ ఈ సినిమాని రిలీజ్ చేస్తామని చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్, ఎక్సిబ్యూటర్స్ కోటి రుపాయిలకి అడగడం చెన్నకేశవ రెడ్డి’ క్రేజ్ కి నిదర్శనం. ఈ సినిమాకి వచ్చే రెవెన్యూలో 75 శాతం బాలకృష్ణ గారి బసవతారకం ట్రస్ట్ కి, మిగతాది నాకు సంబధించిన అసోషియేషన్స్ కి ఇవ్వాలని నిర్ణయించాం'' అని వెల్లడించారు సురేష్.
వినాయక్ మాట్లాడుతూ.. బాలయ్య బాబు గారికి ఎన్నో సూపర్ హిట్లు వున్నాయి. కానీ ఈ సినిమాని ఎక్కువగా ఓన్ చేసుకున్న బాలయ్య అభిమానులకు కృతజ్ఞతలు. ఈ సినిమానే రిరిలీజ్ చేయాలని అభిమనులు పట్టుబట్టారు. చాలా మంచి ఉద్దేశం కోసం ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. అభిమానులు ప్రేక్షకులు సినిమాని ఆదరించాలి'' అని కోరారు.