టాలీవుడ్ లో ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ తో సినిమా రాబోతోంది. అదే.. 'మీసాలోడు'. యూవీ క్రియేషన్స్ సంస్థ లేటెస్టుగా ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించింది. దాంతో.. ఈ 'మీసాలోడు' ఎవరు? అనే ఆసక్తి మొదలైంది.
యూవీ దగ్గర చాలామంది హీరోలు, దర్శకులు అడ్వాన్సులు తీసుకొన్నారు. వారిలో ఎవరితో ఈ ప్రాజెక్టు మొదలవుతుందో తెలీదు. కాకపోతే టైటిల్ మాత్రం ఇంట్రస్టింగ్ గా ఉంది. యూవీ దగ్గర ఉన్న పెద్ద హీరోల్లో.. రామ్ చరణ్ ఒకడు. చరణ్ తో యూవీ త్వరలోనే ఓ సినిమా పట్టాలెక్కించబోతోంది. ఈ టైటిల్ చరణ్‌కి అయితే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. యూవీ దగ్గర ఎన్టీఆర్, ప్రభాస్ డేట్లు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్‌కి కూడా ఈ టైటిల్ బాగానే సూటవుతుంది. కాకపోతే.. ఏ దర్శకుడి సినిమా కోసం ఈ టైటిల్ రిజిస్టర్ చేయించారో తెలిస్తే... హీరోకి గెస్ చేయొచ్చు. ప్రస్తుతం అభిమానులు మాత్రం ఈ టైటిల్ మా హీరో కోసమే.. అంటూ ఊహల్లో తేలిపోతున్నారు.
అన్నట్టు శ్రీవిష్ణు కూడా యూవీ క్రియేషన్స్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. చివరికి శ్రీవిష్ణు ఈ టైటిల్ తో సినిమా చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.