ఇండ్రస్ట్రీలో రకరకాల రూమర్లు. వాడ్ని వీడు కొట్టాడంట కదా? ఇద్దరికీ పడదంట కదా? అంటూ ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటుంటారు. అయితే అవన్నీ... హీరోలకూ చేరతాయి. కాకపోతే రియాక్ట్ అయ్యేందుకు, వాటి గురించి ప్రస్తావించేందుకు ఒప్పుకోరు. కానీ బాలయ్య అలా కాదు. క్లారిఫై చేస్తే గానీ వదలడు. అన్ స్టాపబుల్ లో అదే జరుగుతోంది. బాలకృష్ణ ప్రయోక్తగా వ్యవహరిస్తున్న టాక్ షో.. అన్ స్టాపబుల్. ఆహాలో అత్యధిక ఆదరణ పొందిన టాక్ షో ఇది. ఈ షో విజయవంతమవ్వడానికి బాలయ్య సింపుల్సిటీనే కారణం.
ఈ షోకి రవితేజ అతిథిగా వచ్చాడు. రవితేజ రాగానే... బాలయ్య - రవితేజలపై వచ్చిన ఓ గాసిప్పుకు క్లారిటీ అడిగేశాడు బాలయ్య.
బాలకృష్ణ- రవితేజ గొడవ పడ్డారని, బాలయ్య రవితేజని కొట్టాడని... ఇద్దరికీ అస్సలు పడదని ఇండ్రస్ట్రీలో రకరకాల రూమర్లు. ఇప్పటి విషయం కాదిది. రవితేజ భద్ర సినిమా సమయంనుంచే మొదలయ్యాయి. ఓ హీరోయిన్ విషయంలో రవితేజకూ, బాలయ్యకూ చెడిందన్న వార్త అప్పటి నుంచే చలామణీ అవుతోంది. ఎట్టకేలకు ఇది పూర్తిగా గాసిప్పే అనిపించాడు బాలయ్య. అన్ స్టాపబుల్ షోకి రవితేజ రాగానే అడిగిన మొట్ట మొదటి ప్రశ్న ఇదే. `నీకూ నాకూ గొడవేంటి` అని. దానికి రవితేజ కూడా తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. `అది పనీ పాటా లేని డాష్ గాళ్లు సృష్టించిన పుకారు` అని కొట్టి పడేశాడు. అలా... ఓ గాసిప్పుకి ఇద్దరు హీరోలూ ఒకేసారి తెర దించేశారు.