పూరి జగన్నాధ్ సిట్ ఇన్వెస్టిగేషన్ ముగిసాక జరిగిన పరిణామాల పై ఒక పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఆ ఇంటర్వ్యూ లో మీ పై ఆరోపణలు వచ్చిన తరువాత ఇండస్ట్రీ వారు మీతో ఇంతకముందులా ఉంటున్నారా లేదా అన్న ప్రశ్నకి - నేను సిట్ విచారణలో ఉండగా -
హీరో బాలకృష్ణ గారు మా ఇంటికి కాల్ చేసి నా కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారని తెలిపాడు. అలాగే మోహన్ బాబు, సురేష్ బాబు, హీరో ప్రభాస్ లు తనకి ధైర్యంగా ఉండు అంటూ మెసేజ్ చేశారు అని తెలిపాడు.
ఈ ఆరోపణల పర్వం మొదలైన రోజునుండి తన కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అయితే తానేమి తప్పు చేయలేదని అందుకే ధైర్యంగా ఉన్నట్టు చెప్పుకొచ్చాడు.
ఇక పూరి జగన్నాధ్ తో మొదలైన విచారణ నిన్న శ్యాం కె నాయుడు, ఇవాళ సుబ్బరాజులు SIT ముందు విచారణకి హాజరయ్యారు.