అప్పుడెప్పుడో 'వరుడు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బ్యూటీ భాగ్యశ్రీ. అప్పుడు అమ్మడి ఎంట్రీకి చాలానే బిల్డప్ ఇచ్చార్లెండి. అయితే అనుకోకుండా ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోవడంతో అమ్మడి ఎంట్రీకి ఇచ్చిన బిల్డప్ అంతా వేస్ట్ అయిపోయింది. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు కూడా చేజిక్కించుకోలేకపోయింది ఈ బ్యూటీ. మళ్లీ పదేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులు తనని గుర్తు పడతారా? లేదా అని చెక్ చేయాలనుకుందో ఏమో, సోషల్ మీడియా వేదికగా ఇదిగో ఇలా గ్లామరస్ అప్పీల్ ఇచ్చింది. ప్రస్తుతం తమిళ, కన్నడ సినిమాల్లో నటిస్తోంది. అవకాశమిస్తే తెలుగులోనూ తన గ్లామర్‌ని ప్రదర్శించడానికి రెడీ అంటోందీ ముద్దుగుమ్మ భాగ్యశ్రీ.