ఆ అయిదు కోట్లు ఏమ‌య్యాయి: బాలకృష్ణ‌

మరిన్ని వార్తలు

నంద‌మూరి బాల‌కృష్ణ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. ఇటీవ‌ల చిత్ర‌సీమ - ప్ర‌భుత్వంతో కొన్ని మీటింగులు పెట్టింది. చిత్ర‌సీమ‌లోని స‌మ‌స్య‌ల గురించి చ‌ర్చించింది. ఆ స‌మావేశాలలో బాల‌య్య క‌నిపించ‌లేదు. బాల‌య్య ఎందుకు రాలేదు? అనే ఆస‌క్తిక‌ర‌మైన చర్చ మొద‌లైంది. `న‌న్నెవ్వ‌రూ పిల‌వ‌లేదు` అంటూ బాల‌య్య కామెంట్ చేయ‌డం, `భూములు పంచుకున్నారా` అంటూ ప్ర‌శ్నించ‌డం టాలీవుడ్ లో క‌ల‌క‌లం రేపింది. ఇప్పుడు మ‌రోసారి బాల‌కృష్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓ యూ ట్యూబ్ ఛాన‌ల్‌కి ఇంట‌ర్వ్యూ ఇచ్చిన బాల‌కృష్ణ `మా` (మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌) ని టార్గెట్ చేసి ప్ర‌శ్నించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ బిల్డింగ్ కోసం విరాళాలు సేక‌రించారు, మ‌రి బిల్డింగ్ ఎందుకు క‌ట్ట‌లేదు? అని సంచ‌ల‌న కామెంట్లు చేశారు.

 

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం బిల్డింగ్ కడతామని అన్నారు. అమెరికా వెళ్లారు. నన్ను పిలిచారా? చిరంజీవిగారు అంతా కలిసి అమెరికా వెళ్లారు. డల్లాస్‌లో ఫంక్షన్ చేశారు. ఐదు కోట్లు అన్నారు. ఇవాళ కట్టారా ‘మా’ కోసం బిల్డింగ్. ఈవాళ గవర్నమెంట్ ఎంతో సపోర్టింగ్‌గా ఉంది. మేమంతా ఇక్కడ ఉన్నాం కాబట్టి అంటున్నారు. మరి ఈవాళ అడిగితే రెండు మూడు ఎకరాలు ఫ్రీగా ఇవ్వరా? ఇండస్ట్రీ నుంచి ఎంత టాక్స్ కలెక్ట్ చేస్తున్నారు? కరోనాని పక్కన పెట్టి ఎందుకు సినిమా షూటింగ్స్ మొదలెట్టాలని ఆరాటం? కారణం టాక్స్‌లు.. డబ్బు. ఈ సొసైటీలో అత్యధికంగా టాక్స్ పే చేసేది మా ఇండస్ట్రీనే. ఇంత వరకు భవనం కట్టలేదు. ఒక్క బిల్డింగ్ కట్టడానికే.. మద్రాస్‌లో చూడండి. మేం డబ్బులు పెట్టి కట్టుకోలేమా? ఆ ఆలోచనలు రావు. అక్కడికి వెళ్లారు. ఏదో 5 కోట్లు అన్నారు. తర్వాత కోటి అన్నారు. మిగతా 4 కోట్లు ఏమయ్యాయి?`` అంటూ నిల‌దీశారు బాల‌య్య‌. కొంత‌కాలం క్రితం ఇదే అంశంపై మాలో పెద్ద ర‌చ్చే జ‌రిగింది. కానీ చివ‌రికి ఏమైందో తెలీదు. ఇప్పుడు బాల‌య్య వ్యాఖ్య‌ల‌తో ఆ వివాదం మ‌ళ్లీ ముందుకొచ్చిన‌ట్టైంది. దీనిపై `మా` పెద్ద‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS