నాగ‌బాబుని లైట్ తీసుకున్న బాల‌య్య‌

మరిన్ని వార్తలు

నంద‌మూరి బాల‌కృష్ణ - నాగ‌బాబు ఎపిసోడ్‌... ఈమ‌ధ్య టాలీవుడ్ ని షేక్ చేసింది. `భూములు పంచుకున్నారా` అంటూ బాల‌య్య ప్ర‌శ్నించ‌డం - నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అంటూ నాగ‌బాబు వార్నింగ్ ఇవ్వ‌డం... ప‌రిశ్ర‌మ‌లోని వాతావ‌ర‌ణాన్ని వేడెక్కించేలా చేశాయి. బాల‌య్య క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే అని నాగబాబు డిమాండ్ చేయ‌డం కూడా ఆస‌క్తిని క‌లిగించింది. ఈ ప‌రిణామ‌ల నేప‌థ్యంలో బాల‌కృష్ణ ఓ యూ ట్యూబ్ ఛాన‌ల్ తో ముఖాముఖి ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా నాగ‌బాబు టాపిక్ వ‌చ్చింది.

 

నాగబాబుతో గొడ‌వ‌పై మీ సమాధానం ఏమిటి? అని అడిగితే బాల‌య్య పెద్ద‌గా స్పందించ‌లేదు. నేనేం గొడ‌వ ప‌డలేదు, త‌నే మాట్లాడాడు.. అంటూ స‌మాధానం ఇవ్వ‌కుండా త‌ప్పించుకున్నాడు. అంతే కాదు... ప‌రిశ్ర‌మ మొత్తం త‌నవైపు ఉంద‌ని, ఈ స‌మ‌యంలో తానెందుకు మాట్లాడాలంటూ వ్యాఖ్యానించారు. బాల‌య్య‌ని చూస్తుంటే నాగ‌బాబు వ్యాఖ్య‌ల్ని అస్స‌లు ప‌ట్టించుకోలేద‌ని అర్థ‌మ‌వుతోంది. అందుకే.. ఏ ప్ర‌శ్న‌కూ పెద్ద‌గా రియాక్ట్ అవ్వ‌లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS