సంక్రాంతి బరిలో దిగుతున్న మూడు సినిమాల్లో ఇప్పటికే గేమ్ చేంజర్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ముగిసింది. నెక్స్ట్ రిలీజ్ కానున్న బాలకృష్ణ 'డాకు మహారాజ్' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉండగా అది ఇప్పుడు రద్దు అయ్యింది. కారణం తిరుపతి ఘటన. బాలయ్య, బాబీ కాంబో మూవీ డాకు మహారాజ్ జనవరి 12 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ యూఎస్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇండియాలో అనంతపురంలో జనవరి 9 న గ్రాండ్ గా నిర్వహించాలి అనుకున్నారు. నారా లోకేష్ ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవ్వాల్సి ఉండగా ఇపుడు ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యింది.
సితార ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ సంజాయిషీ ఇచ్చింది. 'తిరుపతిలో జరిగిన ఘటన కలచి వేసిందని, కోట్లాది భక్తుల గుండెల్లో కొలువై ఉన్న ఏడు కొండల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇలా జరగడం హృదయ విదారకరం. భక్తుల కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు నిర్వహించాలనుకున్న 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ కష్ట కాలంలో మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం' అని పేర్కొంది.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి సుమారు 8 మంది మరణించారు. కొందరు గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే డాకు మహారాజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేసింది టీమ్. తెలుగు రాష్ట్రాల్లో అసలు ఇప్పటివరకు డాకు మహారాజ్ ఈవెంట్స్ జరగలేదు. ప్రీరిలీజ్ ఫంక్షన్ భారీగా ప్లాన్ చేసారు. కానీ ఇపుడు తిరుపతి ఘటన వలన క్యాన్సిల్ అయింది. బాలయ్య ఫాన్స్ టీమ్ నిర్ణయాన్ని గౌరవిస్తూ ప్రశంసిస్తున్నారు.