నిర్మాతలుగా మారనున్న బాలయ్య కూతుర్లు

మరిన్ని వార్తలు

టాలీవుడ్ లో స్టార్ హీరోల వారసులు కొందరు ఇప్పటికే ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నారు. మెగాస్టార్ ఇంటి నుంచి రామ్ చరణ్, నాగార్జున వారసులుగా నాగ చైతన్య, అఖిల్, నందమూరి వారసుల్లో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇప్పటికే ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు కానీ బాలయ్య వారసుడి కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. ఎప్పటి నుంచో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అదిగో ఇదిగో అంటున్నారు కానీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావటం లేదు. త్వరలోనే పవన్ , మహేష్ వారసులు కూడా వస్తున్నారు అన్న వార్తలతో నందమూరి ఫాన్స్ మళ్ళీ ఇంకో సారి మోక్షజ్ఞ కోసం చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య కుటుంభం నుంచి డబుల్ ట్రీట్ రానుందని టాక్ .


బాలయ్య కూడా  త్వరలో మోక్షజ్ఞ సినిమా ఉంటుందని రీసెంట్ గా అనౌన్స్ చేశారు. ఇందుకోసం కథా చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ వస్తుందని టాలీవుడ్‌ టాక్‌. అయితే మోక్షజ్ఞ కోసం బాలయ్య కూతుర్లు ఇద్దరు పోటీ పడుతున్నారంట. తమ్ముడి మొదటి సినిమా బాధ్యతలు ఇద్దరు పంచుకోవాలంటూ నేనే అంటే నేను అని పోటీ పడుతున్నారంట. బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణి, ఇప్పటికే బిజినెస్ లో నంబర్ వన్ అనిపించుకున్నారు.  చంద్రబాబు అరెస్ట్ టైంలో ప్రజల్లోకి వచ్చి, నిర్భయంగా మాటలాడి అందరి మనసుల్లో స్థానం సంపాదించుకుంది. దీనితో బ్రాహ్మణి రాజకీయ అరంగేట్రం పక్కా అని అంతా అనుకున్నారు. కానీ అలాంటి ఆలోచనలు లేవని తప్పుకుంది. అసలు సినిమా రంగంతో పరిచయం లేని బ్రాహ్మణి ఇప్పుడు తమ్ముడి కోసం నిర్మాతగా మారాలనుకుంటోంది. 


బాలయ్య చిన్న కూతురు తేజశ్విని ప్రస్తుతం సినీ రంగంలోనే ఉంది. బాలయ్య సినిమా వ్యవహారాలను తేజశ్వని పర్యవేక్షిస్తుంటారు. దీంతో తమ్ముడు మోక్షజ్ఞ సినిమాను తాను నిర్మిస్తానని పట్టుబడుతోంది తేజశ్వని. ఇలా ఇద్దరు పోటీ పడుతుండటంతో బాలయ్య సందింగ్ధంలో పడ్డారంట. ప్రస్తుతానికి కథా చర్చలు, డైరెక్టర్‌ ఎంపికపై ఫోకస్‌ చేసి తరవాత నిర్మాణ బాధ్యతలపై నిర్ణయం తీసుకుంటారట బాలయ్య. మొత్తానికి 2025 లో మోక్షజ్ఞ టాలీవుడ్లో అడుగుపెడతాడు అన్నది ఖాయం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS