ప్రభాస్ నటించిన 'కల్కి' మూవీ జూన్ 27 న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో టీమ్ ప్రమోషన్స్ లో వేగం పెంచింది. సెకండ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేసాక ఇంకొన్ని పాత్రలు రివీల్ అయ్యాయి. కల్కి లో భారీ కాస్టింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ప్రభాస్, దీపికా లాంటి స్టార్లతో పాటు కమల్ హాసన్, అమితాబ్, దిశాపటాని ఉన్నారన్న సంగతి తెలుసు. టీమ్ అనౌన్స్ చేయని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవర కొండ, మృణాల్ ఠాకూర్, మాళవికా నాయర్, శోభన లాంటి స్టార్లు కూడా ఉన్నారని ఇప్పుడు తెలుస్తోంది. మూవీ రిలీజ్ అయ్యాక ఇంకా ఎంత మంది ఉన్నారో చూడాలి.
ఇంత మంది స్టార్స్ ఉండటంతో వీరి రెమ్యునరేషన్ పై పలువురిలో ఆసక్తి పెరిగింది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది. సుమారు 700 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ కి 150 కోట్ల పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. అంతక ముందు వరకు 100 నుంచి 120 కోట్లు తీసుకునే వాడు ప్రభాస్. కల్కికి 30 కోట్లు పెంచాడు. అంటే మొతం మూవీ పెట్టుబడిలో 25 శాతం డార్లింగ్ కి ఇచ్చారు. హీరోయిన్ గా నటించిన దీపికాకి 20 కోట్లు ఇచ్చారని టాక్. దీపికా కల్కికి ముందు 10 నుంచి 15 తీసుకునేదని కల్కికి 20 కోట్లు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.
నెక్స్ట్ అమితాబ్ కి 20 కోట్లు, కమల్ కి 20 కోట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. అంటే కమల్ రెండు పార్ట్ లకి కలిపి మొత్తం 50 కోట్లు తీసుకుంటున్నాడని టాక్. ఇంకో హీరోయిన్ గా నటించిన దిశా పఠాని 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంది. మిగతా నటీనటులకు ఇచ్చే బడ్జెట్ తో కలిపి దాదాపు 300 కోట్లు రెమ్యునరేషన్ కి పోగా మిగతావి టెక్నీషియన్స్ కి. మిగతా ఖర్చులు అని తెలుస్తోంది. ఇప్పటికే ఓవర్సీస్, థియేట్రికల్ రైట్స్ , శాటిలైట్ అని దాదాపు బడ్జెట్ కవర్ చేసేసినట్లు టాక్. ఇక బాక్సాఫీస్ రికార్డ్ లు ఉన్నాయి.