బాలకృష్ణ ఏది చేసినా సంచలనమే! మొన్నటికి మొన్న శాతకర్ణిగా అందరిని అలరించాడు. నిన్నటికి నిన్న పైసా వసూల్ టీజర్ తో అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇక ఇప్పుడు పైసా వసూల్ ఆడియో విడుదల కార్యక్రమానికి మరో సంచలనం సృష్టించనున్నాడు.
అదేంటంటే- దర్శకుడు పూరితో కలిసి బాలకృష్ణ ఈ నెలలో జరగబోయే పైసా వసూల్ ఆడియో కి హెలికాప్టర్ లో రానున్నారట. ఇక ఇదే విషయమై ఇప్పుడు ఫిలిం నగర్ లో పెద్ద చర్చ నడుస్తున్నాదట. ఖమ్మంలో జరిగే ఈ వేడుకకి రెండు రాష్ట్రాలలోని బాలకృష్ణ అభిమానులు పెద్ద సంఖ్యలో రానున్నారట.
ఇక పైసా వసూల్ ట్రైలర్ బాగా వచ్చినట్టు యూనిట్ వర్గాల సమాచారం. టీజర్ ని తలదన్నే రేంజ్ లో ఈ టీజర్ ఉండబోతుంది అన్నది తాజా లీక్.
చూద్దాం. పైసా వసూల్ ట్రైలర్ ఎన్ని రికార్డ్స్ కొట్టనుందో..