సూపర్ స్టార్ మహేష్ వరుసగా సినిమాలతో తన అభిమానులని తెగ ఖుషి చేస్తున్నాడు. ఆయన నటించిన స్పైడర్ చిత్రం విడుదలకి సిద్ధంగా ఉండగా, భరత్ అను నేను చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది.
ఇక ఇంతలోపే తన కెరీర్ లో ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు జరిపించేశాడు. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా, తెలుగు ఇండస్ట్రీ లోనే ప్రముఖ నిర్మాతలైన అశ్విని దత్-దిల్ రాజులు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది సంక్రాంతి నుండి మొదలుకానుంది. ఇక ఈ చిత్రానికి ప్రస్తుత వర్కింగ్ టైటిల్ #Mahesh25.