బాలకృష్ణ చేసిన భారీ సహాయం

మరిన్ని వార్తలు

నందమూరి నటసింహం బాలకృష్ణకి భోళాశంకరుడు అనే పేరు కూడా ఉంది. ఎందుకంటే ఆయనకి తెలిసినవారుకాని లేదా ఆయన అభిమానులు గాని కష్టాల్లో ఉంటే ఆయనకీ తోచిన సహాయం చేస్తూనే ఉంటాడు.

ఇప్పటికే ఆయన తన తల్లి పేరిట ఏర్పాటు చేసిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పెట్టి దానితో ఎంతో మందికి సహయంచేస్తునే ఉన్నారు. ఇక ఈ మధ్యనే బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఒక అబ్బాయికి రూ 20 లక్షలు ఇచ్చి ఆ అబ్బాయి వైధ్యానికి సహాయం చేశాడు.

ఈ విషయం చాలా లేటుగా వెలుగులోకి రావడంతో ఇప్పుడు ఆయన అభిమానులంతా ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీనితో బాలయ్య అభిమానులని కొడతాడు అనే అభిప్రాయం నెలకొన్న తరుణంలో ఇటువంటి వార్త కచ్చితంగా అయన అభిమానులకి ఆనందాన్నిచ్చే అంశం.

మొత్తానికి బాలకృష్ణ చేసిన ఈ సహాయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS