RX 100 పైన నితిన్ కామెంట్స్

మరిన్ని వార్తలు

RX 100 అంటే మనకి కొన్నిరోజుల క్రితం వరకు గుర్తొచ్చేది కేవలం బైక్ మాత్రమే.. కాని ఇప్పుడు RX 100 అంటే చిన్న సినిమాగా విడుదలై సంచలనం సృష్టిస్తున్న ఒక సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఈ సినిమాకి అటు ప్రేక్షకుల నుండే కాక ఇటు ఇండస్ట్రీ నుండి సైతం విపరీతమైన ఆదరణ లబిస్తున్నది. ఇప్పటికే ఆర్జీవీ ఈ చిత్రాన్ని తన భుజాలకేత్తుకుని మరి ప్రమోట్ చేస్తుండగా తాజాగా ఈ జాబీతాలోకి యంగ్ హీరో నితిన్ వచ్చి చేరాడు.

RX 100 సినిమా తాను చూసాను అని, తనకి అది ఎంతలా నచ్చింది అనేది ఒక ట్వీట్ రూపంలో అందరితో పంచుకున్నాడు. #RX100 చిత్రం చాలా రియలిస్టిక్ గా ఉంది అని,  ఈ చిత్రాన్ని బోల్డ్ గా ఆసక్తికర ట్విస్టులతో డైరెక్టర్ చక్కగా తీశాడు. తనకైతే ఈ సినిమాని మంచిగా ఎంజాయ్ చేశాను అని చెబుతూ #RX100 టీం కి అభినందనలు తెలిపాడు.
 

ఇప్పటికే ఈ సినిమాకి కలెక్షన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు రోజులకి రూ 7 కోట్లకి పైగా షేర్ రావడంతో ఈ చిత్రం బ్లాక్ బస్టర్స్ క్లబ్ లో చేరిపోయినట్టే అని అనుకోవచ్చు.

 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS