బాల‌య్య రౌడీయిజం చూపిస్తున్నాడా?

By Gowthami - September 14, 2021 - 10:12 AM IST

మరిన్ని వార్తలు

క్రాక్‌తో ఓ సూప‌ర్ హిట్ అందుకున్నాడు గోపీచంద్ మ‌లినేని, ఇప్పుడు ఏకంగా నంద‌మూరి బాల‌కృష్ణ‌తో సినిమా చేసే ఛాన్స్ ద‌క్కించుకున్నాడు. బాల‌య్య‌- గోపీల కాంబోలో ఓసినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. స్క్రిప్టు దాదాపుగా ఓకే. వచ్చే నెల‌లో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. ఈలోగా `అఖండ‌` సినిమా కూడా పూర్త‌యిపోతుంది.

 

గోపీచంద్ మ‌లినేని సినిమాకి `రౌడీయిజం` అనే పేరు ప‌రిశీలిస్తున్న‌ట్టు ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్. ఈ సినిమా మొత్తం రౌడీయిజం నేప‌థ్యంలో సాగుతుంద‌ట‌. బాల‌య్య పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయ‌ని స‌మాచారం. క‌థానాయిక‌గా త్రిష‌, ఇలియానా పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. ఇద్ద‌రిలో ఒక్క‌రు గ్యారెంటీగా బాల‌య్య పక్క‌న న‌టిస్తార‌ని తెలుస్తోంది. బాల‌య్య - త్రిష‌ల కాంబినేష‌న్ ఇది వ‌ర‌కు చూసేశాం. ఇద్ద‌రూ `రూల‌ర్‌`లో జంట‌గా న‌టించారు. ఈసారి ఇలియానాకు ఛాన్స్ ఇస్తే కొత్త కాంబోని చూసిన‌ట్టు అవుతుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS