మ‌హ‌ర్షి, శ్రీ‌మంతుడు క‌లిపేస్తున్నారా?

By Gowthami - September 13, 2021 - 18:22 PM IST

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్ లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న సంగ‌తి తెలిసిందే. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` త‌ర‌వాత ఎన్టీఆర్ చేయ‌బోయే సినిమా ఇదే. ఇదే కాంబినేష‌న్ లో ఇది వ‌ర‌కు `జ‌న‌తా గ్యారేజ్‌` అనే సినిమా వ‌చ్చింది. ఆ సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఈ కాంబోపై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. కొర‌టాల శివ క‌థ‌ల‌న్నీ సామాజిక నేప‌థ్యంలోనే సాగుతాయి. ఈసారి కూడా ఎన్టీఆర్ కోసం అలాంటి క‌థ‌నే సిద్ధం చేశాడ‌ని టాక్‌.

 

ఇదో ఊరి క‌థ అని, ఆ ఊరిలో పుట్టి, ఎంతో ఎత్తుకు ఎదిగిన ఓ యువ‌కుడు... మ‌ళ్లీ సొంత ఊరొచ్చి ఏం చేశాడు? అనే ఇతివృత్తంతో ఈ క‌థ న‌డుస్తుంద‌ని స‌మాచారం. అయితే ఇలాంటి లైన్ల‌తోనే ఇది వ‌ర‌కు శ్రీ‌మంతుడు అనే సినిమా వ‌చ్చింది. దానికీ కొర‌టాల‌నే ద‌ర్శ‌కుడు. మ‌హేష్ బాబు న‌టించిన `మ‌హ‌ర్షి` కూడా ఈ త‌ర‌హా క‌థే. దాంతో మ‌హ‌ర్షి, శ్రీ‌మంతుడు క‌థ‌ల్ని కొర‌టాల క‌లిపేశాడా? అంటూ చ‌ర్చించుకుంటోంది టాలీవుడ్. ఈ క‌థ‌పై ఎన్టీఆర్ సైతం అసంతృప్తితో ఉన్నాడ‌ని, అందుకే క‌థ‌లో కీల‌క‌మైన మార్పులు చేయ‌మ‌ని సూచించాడ‌ని టాక్. నిజానికి ఇదే క‌థ‌ని అల్లు అర్జున్ కి చెప్పి ఒప్పించాడు కొర‌టాల‌. బ‌న్నీ... `పుష్ష‌`తో బిజీ అయిపోవ‌డం వ‌ల్ల‌.. అదే క‌థ‌ని ఇప్పుడు ఎన్టీఆర్ తో చేయాల‌నుకుంటున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS