పరిశ్రమ అంతా ఒకలా ఆలోచిస్తే... బాలకృష్ణ మాత్రం మరోలా ఆలోచిస్తుంటాడు. ఇండ్రస్ట్రీ అంతా `హిట్టు` జపం చేస్తుంటే.. బాలయ్య మాత్రం అవేం పట్టించుకోడు. ఫ్లాపుల్లో ఉన్నవాళ్లకు పిలిచి మరీ అవకాశాలు ఇస్తుంటాడు. బోయపాటి శ్రీనుతో బాలయ్య ఓ సినిమా చేస్తున్నాడు. ఆయన ఫ్లాపుల్లో ఉన్నాడు. బి.గోపాల్ తో ఓ కాంబినేషన్ ని సెట్ చేశాడు బాలయ్య. ఆయన ఎప్పుడో రిటైర్డ్ అయిపోయిన దర్శకుడు. కె.ఎస్.రవికుమార్, వినాయక్... ఇలా ఫ్లాపుల్లో ఉన్న దర్శకులతోనే పనిచేయడానికి మొగ్గు చూపిస్తున్నాడు బాలయ్య. ఇప్పుడు ఎట్టకేలకు ఓ హిట్ దర్శకుడికి అవకాశం ఇచ్చాడు. తనే .... గోపీచంద్ మలినేని.
క్రాక్ సినిమాతో ఓ సూపర్ హిట్టు కొట్టాడు గోపీచంద్ మలినేని. తన తదుపరి సినిమా బాలకృష్ణతో సెట్ అయ్యింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించనుంది. ఇప్పటికే అగ్రిమెంట్లు జరిగిపోయాయి. బాలయ్య కథ వినడమే తరువాయి. బాలయ్య కోసం క్రాక్ కి ముందే.. ఓ పవర్ ఫుల్ కథని రెడీ చేశాడట గోపీచంద్. మైత్రీ కూడా దాన్ని ఓకే చేసింది. మైత్రీతో ఓసినిమా చేయడానికి ఇది వరకే... బాలయ్య ఒప్పందాలు చేసుకున్నారు. అలా.. ఈ కాంబో సెట్టయ్యింది.