నటీనటులకు, సాంకేతిక నిపుణులకూ... ఒక్కసారైనా చిరంజీవి సినిమాకి పనిచేయాలన్న ఆశ ఉంటుంది. తమన్ కీ అలాంటి కల ఉంది. చాలామంది స్టార్లతో పనిచేసినా, చిరంజీవి సినిమాకి సంగీతం అందించే అవకాశం తనకు ఇప్పటి వరకూ రాలేదు. `చిరంజీవి సినిమాకి పనిచేయడం నా కల` అని తమన్ చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు అది నిజమైంది. చిరు సినిమాకి సంగీత దర్శకుడిగా తమన్ ఎంపికయ్యాడు. చిరంజీవి `లూసీఫర్` చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్ ని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. ఈ విషయాన్ని తమన్ ట్విట్టర్ ద్వారా ధృవీకరించాడు. ఓ కంపోజర్ గా తన కల నెరవేరిందన్న సంతోషం వ్యక్తం చేస్తున్నాడు తమన్. `బ్రూస్లీ` సినిమా లో చిరంజీవి ఓ చిన్న పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. చిరు ఎంట్రీ సమయంలో తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చిరు ఫ్యాన్స్‌కి చాలా బాగా నచ్చింది. చిరు సినిమాకి తమన్ సంగీతం అందిస్తే చూడాలని వాళ్లూ ఆశ పడ్డారు. ఇప్పుడు ఆ కోరిక నెరవేరబోతోంది.