బాలయ్యతో విధ్వంసానికి హరీష్ రెడీ

మరిన్ని వార్తలు

టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల్లో హ‌రీశ్ శంక‌ర్ ఒకరు. ఈ రోజు ఈ సెన్షేషనల్ డైరక్టర్ పుట్టిన రోజు కావటంతో హరీష్ కి నెట్టింట పలువురు శుభాకాంక్షలు చెప్తున్నారు.  ఈ సంధర్భంగా వచ్చిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. హరీష్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు. ప్రజంట్ ఏపీ లో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఈ మూవీకి కాస్త బ్రేక్ దొరికింది. ఈలోగా తన మిగతా ప్రాజెక్ట్స్ ని పట్టాలెక్కించి పనిలో ఉన్నాడు హరీష్. ఈ క్రమంలోనే మాస్ మహారాజా రవి తేజతో  'మిస్ట‌ర్ బ‌చ్చ‌న్'. మూవీ మొదలు పెట్టాడు. ఇది బాలీవుడ్ లో వచ్చిన రైడ్ కి  రీమేక్.  నెక్స్ట్ హరీష్ నందమూరి నటసింహం బాలకృష్ణ తో ఒక సినిమా చేస్తాడని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మూవీని క‌ర్నాట‌క‌కు చెందిన ఒక ప్రముఖ బ్యానర్ నిర్మిస్తుందని కూడా రూమర్స్ వచ్చాయి. 


ఇప్పుడు హరీష్ పుట్టిన రోజుకి విషెస్ చెప్తూ  కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్  ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ లో "హ్యాపీ బ‌ర్త్ డే టూ అవ‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ హ‌రిశ్ శంక‌ర్" అంటూ కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్  ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది.  దీంతో ఈ పోస్ట్ ఇప్పడు వైరల్ గా మారింది. బాలయ్య , హరీష్ సినిమా నిజమే అని, కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ లో ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది. వీటికి సంబధించిన వర్క్ కూడా మొదలయ్యింది అని అందుకే  కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్ సంస్థ హ‌రిశ్ శంక‌ర్ కి ప్ర‌త్యేకంగా బ‌ర్త్ డే విషెస్ చెప్పారని టాక్ . 


ఈ న్యూస్ విన్న నందమూరి  ఫాన్స్  ఫుల్ ఖుషిగా ఉన్నారు.  'గ‌బ్బ‌ర్ సింగ్' లాంటి ప‌వ‌ర్ ఫుల్  క్యారక్టర్ తో పవన్ కి మంచి హిట్ ఇచ్చిన హరీష్ బాలయ్యకి కూడా అలాంటి సూపర్ హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ప్రజంట్ 'మిస్టర్ బచ్చన్' షెడ్యూల్ తో హరీష్, 'NBK 109' తో బాలయ్య బిజీగా ఉన్నారు. మరో వైపు బాలయ్య కూడా ఎలక్షన్ లో పోటీ చేయనుండటంతో హరీష్ బాలయ్య సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో , హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న బాలయ్యకి  హరీష్ ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS