వెడ్డింగ్ కార్డ్స్ పంచుతున్న నవదీప్

మరిన్ని వార్తలు

నవదీప్ గూర్చి పెద్దగా పరిచయం అవసరం  లేదు. సినిమాలతో పాటు ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటాడు. హైదరాబాద్ లో డ్రగ్స్ విషయం తెరపైకి వచ్చిన ప్రతిసారి నవదీప్ పేరు కచ్చితంగా వినిపిస్తుంది. హీరోగా కెరియర్ ప్రారంభించిన నవదీప్ తరవాత సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. యాక్టింగ్ పరంగా మంచి మార్కులు తెచ్చుకున్నా,  ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోవటం, తరచూ వివాదాల్లో చిక్కుకోవటం వలన కెరియర్ డౌన్ అయ్యింది. నవదీప్ ఎక్కడ ఉంటే అక్కడ వాతావరణం మంచి జోష్ గా ఉంటుంది. రియాలిటీ షో లలో నవదీప్ అల్లరి ఇంత కాదు. నవదీప్ కోసం షో చూసే వారు ఉంటారు.    


చాలా కాలం తరవాత నవదీప్ హీరోగా ఒక సినిమా  చేస్తున్నాడు. లవ్ మౌళి అనే టైటిల్ తో  తన కొత్త వర్షన్ చూపిస్తా అంటూన్నాడు నవదీప్.  రిలీజ్ అయిన  గ్లింప్స్  సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. బోల్డ్ కంటెంట్ అయినా కొంచెం ఇంట్రస్టింగ్ గా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో నవదీప్ ఒకరు. ఇప్పుడు తను కూడా వెడ్డింగ్ కార్డ్స్ పంచుతుండటంతో మొత్తానికి నవదీప్ పెళ్లి చేసుకుంటున్నాడు అనుకున్నారు. కానీ ఈ వెడ్డింగ్ కార్డ్స్ తో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.


రీసెంట్ గా నవదీప్ ఓ వీడియో రిలీజ్ చేసాడు. అందులో  పసుపు రాసిన ఓ చిన్న వుడెన్ బాక్స్  ఓపెన్ చేసి అందులో పెళ్లి కార్డు చూపించి, కార్డులో ఉన్న లవ్ మౌళి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాడు. లవ్ మౌళి సినిమా ఏప్రిల్ 19న రిలీజ్ కాబోతున్నట్టు వెడ్డింగ్ కార్డు ద్వారా ప్రజంట్ చేసాడు. దీనితో ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. అసలు పెళ్లి అంటేనే ఆమడ దూరం పరిగెత్తే నవదీప్ ఇలా పెళ్లి  కాన్సెప్ట్ తో ప్రమోషన్ మొదలు పెట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది. పెళ్లి చేసుకోకుండా ఇలా సరదా  తీర్చుకుంటూన్నావా అని  నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ మూవీతో హిట్ కొడితే నవదీప్ మరిన్ని అవకాశాలు అందుకుంటాడేమో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS