చిత్రసీమలో కొన్ని కాంబినేషన్లు... భలే క్రేజ్ తెచ్చేస్తుంటాయి. అలాంటి కాంబో ఇంకోటి కుదిరింది. నందమూరి బాలకృష్ణతో హరీష్ శంకర్ ఓ సినిమా చేయబోతున్నాడట. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించబోతోంది. అయితే.. ఇది ప్రస్తుతానికి పైప్ లైన్ లో ఉంది. బాలయ్య ముద్ర పడితే.... సినిమా ఖాయం.
వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ కి హరీష్ శంకర్ వచ్చాడు. ఈ సందర్భంగా స్టేజీపై మాట్లాడుతూ బాలయ్యతో ఓ సినిమా చేయాలని ఉందని, ఓ మంచి కథతో బాలయ్యని ఒప్పిస్తానని, ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించబోతోందని చెప్పుకొచ్చాడు. హరీష్ మాట్లాడుతున్నప్పుడు బాలయ్య కూడా ముసి ముసి నవ్వులు చిందించాడు. సో.. ఈ కాంబో ఆన్ అయినట్టే. బాలయ్యకి కథ చెప్పడం, ఒప్పించడం చాలా తేలిక. హరీష్ శంకర్‌లాంటి దర్శకులకు మరింత ఈజీ. హరీష్ హీరోని చూపించే విధానం మహా మాస్ గా ఉంటుంది. అలాంటి పాత్రలకు బాలయ్య పెట్టింది పేరు. సో.. ఈ కాంబో కేక పుట్టించడం ఖాయం.