Balakrishna: బాల‌య్య నుంచి మ‌రో పాట‌

మరిన్ని వార్తలు

పెద్ద హీరోలు అప్పుడ‌ప్పుడూ గొంతు స‌వ‌రించుకోవ‌డం మామూలే. బాల‌కృష్ణ కూడా గ‌తంలో ఒక‌ట్రెండు పాట‌లు పాడారు. `శివ‌శంక‌రీ...` అంటూ ఆయ‌న అప్ప‌ట్లో పాడిన పాట‌కు ర‌క‌ర‌కాల స్పంద‌న‌లు వ‌చ్చాయి. `పైసా వ‌సూల్`లో `మామా ఏక్ పెగ్ లా` పాడారు.అది తాగుబోతు పాట కాబ‌ట్టి ఎలా పాడినా ఫ‌ర్వాలేదు. పాట కూడా పాస్ అయిపోయింది. ఇప్పుడు మ‌రోసారి ఆయ‌న ఓ పాట పాడ‌బోతున్నారు. అయితే సినిమా కోసం కాదు. `అన్ స్టాప‌బుల్` కోసం.

 

ఆహా ఓటీటీ వేదిక‌పై సూప‌ర్ హిట్ అయిన పోగ్రాం అన్ స్టాప‌బుల్. ఇప్పుడు సీజ‌న్ 2 న‌డుస్తోంది. ఈ సీజ‌న్ ముగింపు ద‌శ‌కు కూడా వ‌చ్చేసింది. ఈ సంద‌ర్భంగా బాల‌య్య ఓ పాట పాడార్ట‌. ఆ పాట‌ని త్వ‌ర‌లోనే అన్ స్టాప‌బుల్ వేదిక‌పై విడుద‌ల చేస్తార‌ని స‌మాచారం. ఈ పాట స‌ర‌దా ప‌దాల‌తో హుషారుగా సాగిపోతుంద‌ని, అన్ స్టాప‌బుల్ షోకి ఓ ట్రేడ్ మార్క్‌లా మిగిలిపోనుంద‌ని స‌మాచారం. ఇక‌పై అన్ స్టాప‌బుల్ టీజ‌ర్ల‌లో ఈ పాట‌ని వాడాల‌ని ఫిక్స‌య్యార్ట‌. మ‌రి ఆ పాట ఎలా ఉంటుందో తెలియాలంటే.. ఇంకొన్నిరోజులు ఓపిక ప‌ట్టాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS