నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం జై సింహ విడుదలకి రంగం సిద్దమైంది. నిన్ననే ఈ చిత్రానికి సంబందించిన సెన్సార్ కూడా పూర్తవ్వడం జరిగింది. ఇక ఈ సినిమా విడుదలయ్యే ముందు మరొక ఈవెంట్ ని ప్లాన్ చేసారు జై సింహ చిత్ర యూనిట్.
అదే జై సింహ ప్రీ-రిలీజ్ ఈవెంట్. ఈ కార్యక్రమం జనవరి 8న హైదరాబాద్ లో జరగనుంది. దీనికి జై సింహ యూనిట్ తో పాటుగా ప్రముఖ దర్శకులైన బోయపాటి శ్రీను, క్రిష్ వంటివారు ముఖ్య అతిధులుగా విచ్చేయనున్నారు. ఇప్పటికే ఈ సంక్రాంతికి విడుదలయ్యే భారీ చిత్రాలలో ఒకటిగా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ తో తమ విడుదలని గ్రాండ్ గా ప్రకటించబోతున్నారు.
ఇక జై సింహ చిత్రంలో బాలయ్య సరసన ఆయనకీ కలిసివచ్చిన జోడి అయిన నయనతార నటించడం ఈ సినిమా పైన అంచనాలని పెంచుతున్నది. అదే కాకుండా సంక్రాంతి సమయంలో విడుదలైన బాలయ్య చిత్రాలు సక్సెస్ అవ్వడం కూడా జై సింహ కి కలిసొచ్చే అంశం.