నటసింహం బాలకృష్ణ తన తాజా చిత్రం ‘జై సింహ’ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారు.
జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుండగా ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కోసం బాలకృష్ణ దుబాయ్ వెళ్ళాడు. దుబాయ్ లో బాలకృష్ణ-నయనతార ల పైన ఒక డ్యూయెట్ ని చిత్రీకరిస్తున్నారు అని తెలిసింది.
తమిళ దర్శకుడు కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ పాత్ర విభిన్నంగా ఉండబోతున్నట్టు సమాచారం.
ఏదైతేనేమి.. పోయిన ఏడాది గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంతో వచ్చి హిట్ కొట్టిన బాలయ్య ఈ ఏడాది సంక్రాంతికి జై సింహా తో రాబోతున్నాడు.
మరి ఈ సారి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటుతాడా లేదా అనేది చూడాలి.