బాలయ్యతో జగ్గూభాయ్‌ డబుల్‌ విలనిజం!

మరిన్ని వార్తలు

ఫ్యామిలీ హీరోగా తనదైన శైలిలో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరో జగపతిబాబు, సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 'లెజెండ్‌' మూవీతో విలన్‌గా కొత్త అవతారమెత్తాడు. తొలి సినిమాకే విలన్‌ పాత్రకు సరికొత్త స్టైల్‌ని పరిచయం చేశాడు జగ్గూభాయ్‌. బాలయ్యకు పోటీగా ఈ సినిమాలో విలన్‌ పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్‌ చేశాడు బోయపాటి శీను. అలా స్టార్ట్‌ చేసిన జగ్గూభాయ్‌ విలనిజం కంటిన్యూ అవుతూనే ఉంది.

 

ఓ పక్క విలన్‌గా నటిస్తూనే, అవసరాన్ని బట్టి, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ సత్తా చాటుతున్నాడు. మధ్య మధ్యలో హీరోగా కూడా కాన్సెప్ట్‌ బేస్‌డ్‌ మూవీస్‌తో అలరిస్తున్నాడు. ఇక తాజాగా జగపతిబాబు 'మహర్షి'లో పవర్‌ఫుల్‌ విలనిజం చూపించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి బాలయ్యతో విలనిజానికి సై అంటున్నాడు జగపతిబాబు. అయితే, ఈ సినిమాలో విలన్‌గా జగపతిబాబు క్యారెక్టర్‌ చాలా కొత్తగా ఉంటుందట.

 

అది డబుల్‌ రోల్‌ అనీ తెలుస్తోంది. అంటే, అప్పుడెప్పుడో 'గజిని' సినిమాలో విలన్‌ డబుల్‌ రోల్‌ పోషించినట్లు అన్నమాట. అలాగే డబుల్‌ రోల్‌ విలనిజంతో హీరోని కన్‌ఫ్యూజ్‌ చేసే క్యారెక్టర్‌ అనీ తెలుస్తోంది. విలన్‌గా జగ్గూభాయ్‌ని నెక్స్ట్‌ లెవల్‌కి తీసుకెళ్లే పాత్రగా ఈ పాత్ర చిత్రీకరణ ఉండబోతోందట. మే 17న ఈ సినిమా ప్రారంభం కానుంది. జూన్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానుందట. 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ తర్వాత బాలయ్య నటిస్తున్న చిత్రమిది. గతంలో కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో 'జైసింహా' మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS