నందమూరి బాలకృష్ణ కథల వేటలో ఉన్నారు. ఓవైపు బోయపాటి శ్రీను సినిమా చేస్తూనే, కొత్త కథలు వింటున్నారు. బాలయ్యకు ఇటీవలే శ్రీవాస్, సంతోష్ శ్రీన్‌వాస్ కథలు వినిపించారు. వినాయక్ లాంటి వాళ్లూ లైన్ లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా... కె.ఎస్.రవికుమార్ కూడా బాలయ్య కోసం కథ రెడీ చేస్తున్నారు. బాలకృష్ణ - కె.ఎస్ రవికుమార్ కాంబోలో ఇది వరకు జై సింహా వచ్చింది. దీనికి సి.కల్యాణ్ నిర్మాత.
ఇప్పుడు ఈ ముగ్గురూ కలిసి మరో ప్రాజెక్టు చేయబోతున్నారు. నిర్మాత సి.కల్యాణ్ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు కూడా. ``బాలయ్యతో ఓ సినిమా ఉంటుంది. కె.ఎస్ రవికుమార్ తోనూ ఓ సినిమా చేస్తాం. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఉండే ఛాన్సులున్నాయి. బాలయ్య కోసం రవికుమార్ ఓ కథ రెడీ చేస్తున్నారు. బాలయ్యకు నచ్చితే వెంటనే ఈ సినిమా పట్టాలెక్కిస్తాం`` అన్నారు సి.కల్యాణ్. అంటే జై సింహా కాంబోకి మళ్లీ జై కొట్టినట్టే అన్నమాట.