100 చిత్రాల అనుభవమో లేక త్వరత్వరగా చిత్రాలు చేయాలన్న కోరికనో తెలియదు కాని బాలయ్య వెంటవెంటనే సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు.
ఇప్పటికే తన 101వ చిత్రం పూరి దర్శకత్వంలో చేస్తుండగా, 102వ చిత్రంకి సంబంధించి అధికారిక ప్రకటన జారి చేసేశాడు. అయితే వెరైటీ గా తెలుగు దర్శకుడితో కాకుండా, ప్రముఖ తమిళ దర్శకుడైన కెఎస్ రవికుమార్ తో ఈ చిత్రం చేయనున్నాడు.
ఈ చిత్రానికి నిర్మాత సీ కళ్యాణ్ నిర్మాతగా సీకే ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నిర్మించనున్నాడు. ఇక ఈ చిత్రానికి సంబందించిన రెగ్యులర్ షూటింగ్ జూలై 10 నుండి మొదలవుతుంది అని తెలిపారు.
ఇక హీరోయిన్ అలాగే ఇతర టెక్నీషియన్స్ గురించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.