చుక్క‌లు చూపిస్తున్న బాల‌య్య‌.

By iQlikMovies - June 01, 2020 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

చిత్ర‌సీమ ప్ర‌స్తుతం `పొదుపు` మంత్రం పాటించాల్సి వ‌స్తోంది. క‌రోనా ఎఫెక్టుతో కాస్ట్ క‌టింగులు, పారితోషికాలు త‌గ్గించుకోవ‌డాలూ కామన్ అయిపోయాయి. అయితే కొంత‌మంది మాత్రం ఇంకా పాత రోజుల్లోనే ఉన్నార‌నిపిస్తోంది. బ‌డ్జెట్ త‌గ్గించ‌డానికి స‌సేమీరా అంటున్నారు. నంద‌మూరి బాల‌కృష్ణ వైఖ‌రి కూడా ఇలానే ఉంది. బాల‌కృష్ణ - బోయ‌పాటి కాంబోలో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనాకి ముందు ఈ సినిమాకి వేసుకున్న బ‌డ్జెట్ 70 కోట్లు. ఇంత బ‌డ్జెట్ అయితే బాల‌య్య‌మీద వ‌ర్క‌వుట్ కాద‌ని నిర్మాత చెప్ప‌డంతో - బోయ‌పాటి కాస్త క‌నిక‌రం చూపిస్తూ 50 కోట్ల‌కు త‌గ్గించాడు. క‌రోనా ఎఫెక్ట్‌తో ఈ సినిమా బ‌డ్జెట్ ఇంకా త‌గ్గాలి. కానీ.. అదేం జ‌ర‌గం లేదు. ఈ సినిమా బ‌డ్జెట్ ఎట్టిప‌రిస్థితుల్లోనూ త‌గ్గించ‌కూడ‌ద‌ని బాల‌య్య గ‌ట్టిగా చెప్పాడ‌ట‌.

 

ఖర్చు పెడితేనే క్వాలిటీ ఉంటుంద‌ని, ఆ విష‌యంలో రాజీ ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని బాల‌య్య చెబుతున్నాడ‌ట‌. బ‌డ్జెట్ త‌గ్గించుకునే ప‌నిలో భాగంగా ఈ సినిమాలో ఓ కొత్త క‌థానాయిక‌ని తీసుకుందామ‌నుకున్నారు. కానీ.. బాల‌య్య వ‌ల్ల మ‌ళ్లీ స్టార్ హీరోయిన్‌ని ఎంచుకునే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని తెలుస్తోంది. మొత్తానికి బాల‌య్య వైఖ‌రితో ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. రేపు ఈ సినిమా హిట్ట‌యి, సింహా - లెజెండ్‌ల రేంజులో ఆడితే ఎంత పెట్టుబ‌డి పెట్టినా పెద్ద మేట‌రేం కాదు. తిరిగి రావ‌డం ఖాయం. బ‌హుశా బాల‌య్య న‌మ్మ‌కం కూడా దానిమీదేనేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS