బ‌న్నీ టీమ్‌తో మ‌హేష్‌

By iQlikMovies - June 01, 2020 - 09:01 AM IST

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌లో స‌క్సెస్ ఒక్క‌టే మాట్లాడుతుంది. ఎవ‌రి ద‌గ్గ‌ర స‌క్సెస్ ఉంటే వాళ్ల‌ని ఫాలో అయిపోవ‌డ‌మే. మ‌హేష్‌బాబు ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఈ సంక్రాంతికి విడుద‌లైన `అల వైకుంఠ‌పుర‌ములో` సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. ఆల్ టైమ్ టాప్ 2లో నిలిచింది. ఇప్పుడు అదే టీమ్ తో ప‌నిచేయాల‌ని ఉబ‌లాట ప‌డుతున్నాడు మ‌హేష్. మ‌హేష్ కొత్త సినిమా `స‌ర్కారు వారి పాట‌` సాంకేతిక నిపుణుల్ని చూడండి.

 

సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్‌, క‌ళా ద‌ర్శ‌కుడు ప్ర‌కాష్‌, కెమెరామెన్ వినోద్‌.. వీళ్లంతా `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రానికి ప‌నిచేసిన‌వ‌వాళ్లే. క‌థానాయిక‌గా పూజా హెగ్డే పేరు ప‌రిశీలిస్తున్నార‌ని తెలిసింది. త‌నూ.. వైకుంఠ‌పుర‌ములో బ్యాచే. ప్ర‌తినాయ‌కుడిగా ఉపేంద్ర‌ని ఎంచుకుంటే.. ఈ సినిమాలో స‌గం టీమ్‌.. బ‌న్నీ బ్యాచే అవుతుంది. ఎందుకంటే.. బ‌న్నీ సినిమా `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి`తోనే ఉపేంద్ర విల‌న్‌గా మారాడు. అలా... బన్నీ టీమ్ నే మ‌హేష్ న‌మ్ముకున్నాడ‌న్న‌మాట‌.
sarkaru vari pata


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS