తేనె తుట్టెని క‌దిపిన బాల‌య్య‌

మరిన్ని వార్తలు

బాల‌కృష్ణ రూటే సెప‌రేటు. భోళా మ‌నిషి. ఏదైనా స‌రే.... ముక్కు సూటిగా మాట్లాడేస్తుంటాడు. తాజాగా `మా` వ్య‌వ‌హారంపైనా అలానే ముక్కుసూటిగా స్పందించారు. తెలంగాణ ప్ర‌భుత్వంతో - టాలీవుడ్ పెద్ద‌లు రాసుకుపూసుకుని తిరుగుతున్నారు క‌దా, వాళ్లు అడిగితే ఎకరం స్థ‌లం ఇవ్వరా? అంటూ సెటైర్లు వేశారు. అంతే కాదు.. `మా` నిధుల కోసం అమెరికా వెళ్లారు క‌దా.. ఆ నిధులు ఏమ‌య్యాయి? అని ప్ర‌శ్నించారు. మా వ్య‌వ‌హారంలో తాను త‌ల‌దూర్చ‌న‌ని స్ప‌ష్టం చేశారు. విష్ణు బిల్డింగ్ క‌డ‌తానంటే, త‌న వంతుగా ఓ చేయి వేస్తాన‌ని హామీ ఇచ్చారు. మొత్తానికి బాల‌య్య వ్యాఖ్య‌లతో ఓ తేనె తుట్టెని క‌దిపినంత ప‌నైంది.

 

అయితే... ఇప్పుడు రివ‌ర్స్ లో బాయ‌ల్య‌కే కౌంట‌ర్లు ప‌డుతున్నాయి. చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం అధికారంలో ఉండ‌గా `మా` బిల్డింగ్ కి స్థ‌లం ఎందుకు కేటాయించ‌లేదు.? అప్పుడు మాట్లాడ‌ని బాల‌య్య, ఇప్పుడెందుకు మాట్లాడుతున్నాడు? అని నిల‌దీస్తున్నారు. అమ‌రావ‌తిలో సైతం... చిత్ర‌సీమ‌కు స్థ‌లాలు కేటాయించ‌లేదు క‌దా? అని నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు. మొత్తానికి బాల‌య్య ఓ వివాదాన్ని ర‌గిల్చాడ‌న్న‌ది వాస్త‌వం. ఇప్పుడు తేలాల్సింది... మాకి స్థ‌లం ఇస్తారా? లేదా? అనేది కాదు. అస‌లు మా నిధులు ఏమ‌య్యాయి? ఆ గోల్ మాల్ క‌థేంటి? అన్న‌దే. దీనిపై `మా` స్పందిస్తుందా, లేదా? అనేది చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS