నటసింహం బాలకృష్ణ-సూపర్ స్టార్ మహేష్ బాబు ల కలయికలో ఒక మల్టీ స్టారర్ రానున్నట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఇక ఈ ఇద్దరు పెద్ద హీరోలని డైరెక్ట్ చేయబోయేది మరెవరో కాదు, పక్కా యాక్షన్ & కమర్షియల్ డైరెక్టర్ అయిన బోయపాటి శ్రీను. ఇప్పటికే బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలు ఉండగా ఇప్పుడు అదే హిట్ కాంబినేషన్ కి మహేష్ తోడు అవ్వనున్నాడట.
ఇక ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు నిర్మించనున్నట్టు సమాచారం. అయితే ఈ వార్తని ఇంకా అధికారికంగా దృవీకరించవలసి ఉంది. ప్రస్తుతం బోయపాటి చేయనున్న రామ్ చరణ్ చిత్రం తరువాత ఇది మొదలుకానున్నట్టు తెలుస్తున్నది.
ఏదేమైనా... ఈ అపూర్వ కలయికలో ఒక చిత్రం రానుండడం నిజంగా సర్ప్రైజ్ అనే చెప్పాలి.