నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముగిసిన వెంటనే ఈ సినిమా సూటింగ్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నారు బోయపాటి. మరోవైపు బాలకృష్ణ కూడా తన గెటప్పుల విషయంలో తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఇది వరకు బాలయ్యపై ఓసారి మేకప్ టెస్ట్ జరిగింది.
ఇప్పుడు మరోసారి బాలయ్య మేకప్టెస్ట్తో బిజీగా ఉన్నారు. ఆ తరవాతే.. ఎలాంటి గెటప్‌లో కనిపిస్తే బాగుంటుందన్న విషయంపై బాలయ్య ఓ నిర్ణయానికి వస్తారు. ఇది వరకు బాలయ్య ఈ సినిమా గెటప్ కోసమే గుండు చేయించుకున్నారు. ఆ తరవాత బాలయ్య గెటప్‌పై కొన్ని ప్రయోగాలు జరిగాయి. వాటిలో రెండు గెటప్పుల్ని ఖరారు చేశారు. అందులో ఒకదాన్ని ఫిక్స్ చేయాల్సివుంది. ఈ సినిమా కోసం ఓ నూతన కథానాయికని పరిచయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.-