అయ్యప్పనుమ్ కోషియుమ్ - ఈ రీమేక్‌పై ముందు నుంచీ ఆసక్తి చూపిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన హీరోగా ఈ రీమేక్ తెలుగులో తెరకెక్కుతుందని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ సినిమా బాలయ్య చేతుల్లోంచి జారి... రవితేజ ఒళ్లో పడింది. ఈ రీమేక్ రైట్స్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ దగ్గర ఉన్నాయి. నిర్మాత రాధాకృష్ణ బాలయ్యతో సంప్రదింపులు కూడా జరిపారు. అయ్యప్పనుమ్ కోషియమ్‌ని ఈమధ్యే బాలయ్య వీక్షించారు కూడా. రెండో హీరోగా రానా సెట్ అయ్యాడు. ఇక దర్శకుడ్ని ఎంచుకుని, షూటింగ్ మొదలెడదాం.. అనుకుంటున్న తరుణంలో.. బాలయ్య ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ స్థానంలో రవితేజ వచ్చి చేరాడు.
బాలయ్య చేతిలో బోయపాటి సినిమా ఉంది. అది పూర్తయ్యాక ఒకట్రెండు ప్రాజెక్టుల్ని పట్టాలెక్కించాల్సివుంది. అందుకే.. ఈ సినిమా నుంచి బాలయ్య తప్పుకున్నారని తెలుస్తోంది. మరోవైపు రవితేజ, రానాలతో ఈ మల్టీస్టారర్ తెరకెక్కిస్తామని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌సంస్థ ప్రకటించింది. ఆగస్టులో చిత్రీకరణ మొదలెడతారు. దర్శకుడు ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు.